అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో డబ్బు విపరీతంగా పట్టుబడుతుంది. అది ఎన్నికలకు సంబంధించిందా లేక వ్యాపార లావాదేవీలకు చెందినదా అనేది పక్కనపెడితే.. తనిఖీల్లో మూటలు, సూట్ కేసుల కొద్దీ డబ్బు కట్టలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ 23వ తేదీ గురువారం మధ్యాహ్నం.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. హైటెక్ సిటీ ఏరియాలో.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో.. బొటానికర్ పార్క్ నుంచి చిరక్ పబ్లిక్ స్కూల్ వెళ్లే రహదారిలో పోలీసులు తనిఖీలు చేశారు.
సోదాల్లో భాగంగా.. ఓ కారులో రెండు సూట్ కేసులు ఉన్నాయి. వాటివి విప్పి చూడగా.. 5 కోట్ల రూపాయల డబ్బు ఉంది. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు. రెండు సూట్ కేసుల్లో ఉన్న డబ్బు.. సిటీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినగా చెబుతున్నారు పోలీసులు. ఎన్నికల సమయంలో 50 వేల రూపాయలకు మించి తీసుకెళ్లకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా ఐదు కోట్ల రూపాయల నగదు తరలిస్తుండటంతో.. ఆ డబ్బు మొత్తాన్ని ఇన్ కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు పోలీసులు.
ఈ 5 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి పన్నులు చెల్లించారా లేదా అనేది ఆ శాఖ విచారణ చేయనుంది.