అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును పోలీసులు పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లోని చంద్రాపుర్ కు చెందిన అజయ్ కుమార్, రోహిత్ తోపాటు కాగజ్ నగర్​కు చెందిన విశాల్, ఆకాశ్ శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ రోడ్డులో  రెండు స్కూటీల మీద వెళ్తుండగా అక్కడే పెట్రోలింగ్​చేస్తున్న పోలీసులు అనుమానంతో వారిని ఆపారు.

తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 1150 దేశీదారు మద్యం సీసాలు తలిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ. రూ.40 వేల 250 ఉంటుందని చెప్పారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.