
- మహిళ హత్య కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇరుగదిండ్ల శివానంద (45)గా గుర్తించారు. కోరిక తీర్చి, మరో రూ.500 ఎక్కువగా అడిగినందుకు ఆమెను నిందితుడు దారుణంగా హతమార్చినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను డీసీపీ కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. శివానంద(45) కుటుంబ సభ్యులతో గొడవపడి సిటీకి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కుషాయిగూడలో నివాసం ఉంటోంది.
డబ్బులు తీసుకుని సెక్స్వర్క్గా కూడా పనిచేస్తోంది. ఈ నెల 23న మధ్యాహ్నం మేడ్చల్ బస్టాప్ వద్ద ఆమె వేచి ఉండగా, శామీర్‌పేట మజీద్పూర్లో ఉంటూ స్టోన్ కట్టర్‌గా పనిచేస్తున్న కరీంనగర్కమలాపూర్కు చెందిన షేక్ఇమామ్ (37) వచ్చి మాటలు కలిపాడు. తన కోరిక తీర్చితే రూ.500 ఇస్తానని చెప్పడంతో అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఇమామ్బైక్పై మునీరాబాద్ ఓఆర్ఆర్ కింద కల్వర్ వద్దకు వెళ్లారు. కోరిక తీర్చిన తర్వాత ఆమె మరో రూ.500 అదనంగా అడగడంతో అందుకు షేక్ఇమామ్నిరాకరించాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఇమామ్ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మృతురాలి చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.