
ఇటీవల సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులో మిస్టరీ వీడింది.. ఆరు బృందాలతో దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు.హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరి కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో హత్యకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు ఎస్పీ కిరణ్ ఖరే.ఈ హత్యకు కారణం సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదమేనని తేల్చారు పోలీసులు.
పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారని అన్నారు. హత్యలో నలుగురు పాల్గొన్నారని.. దుండగులు వరంగల్ లోని కాశీబుగ్గలో హత్య కోసం కత్తులు, రాడ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇతర కొణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
Also Read :- భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
బీఆర్ఎస్ హయాంలో పోలీసులు రాజలింగమూర్తి పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు , ప్రాజెక్టు అధికారులపై ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. రూ. లక్షా 35 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కొద్ది సంవత్సరాలకే కుంగిపోయిందని, పెద్దమొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని.. దీనికి బాధ్యులైన కేసీఆర్, హరీశ్‌రావు, ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు.