హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం (అక్టోబర్ 22) రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్‌లోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల లైసెన్స్‌లను చెక్ చేస్తున్నారు.బార్లు, పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసీ పర్మిషన్లను మాదాపూర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే సీజ్ చేయడంతో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పబ్‌ల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ | విధుల్లో నిర్లక్ష్యం.. ఐదుగురు AEOలపై సస్పెన్షన్ వేటు