అలంపూర్ సరిహద్దులో పోలీసుల తనిఖీలు.. హైదరాబాద్ కారులో 30 లక్షలు పట్టివేత

అలంపూర్ సరిహద్దులో పోలీసుల తనిఖీలు.. హైదరాబాద్ కారులో 30 లక్షలు పట్టివేత

కర్నూలు : ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపధ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పక్కన తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సెబ్ అధికారులు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి తదితరులు తనిఖీలు ముమ్మరం చేశారు. అలంపూర్ సరిహద్దులోని కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్ పొస్టు వద్ద ఒక కారులో రూ.30 లక్షల నగదును పట్టుకున్నారు.  అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి చెందిన నాగరాజు వోక్స్ వ్యాగన్ కారులో హైదరబాద్ నుంచి వస్తుండగా ఆపి తనిఖీ చేశారు. కారులో  మొదట రూ.5 లక్షలు దొరికాయి. అనుమానంతో మరింత నిశితంగా తనిఖీ చేయగా మరో రూ.25 లక్షలు దొరికాయి. కారులో ఉన్న వ్యక్తి తాను న్యాయవాదినని,  స్థలం కొనుగోలు కోసం డబ్బు తీసుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారపత్రాలు చూపకపోవటంతో సెబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య కారు సీజ్ చేసి ఎన్నికల అధికారులకు  అప్పగించారు.

ఇవి కూడా చదవండి

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు

28న ‘ప్రైవేట్‌’తో ఇస్రో తొలి ప్రయోగం