మనోహరాబాద్ లో కేటీఆర్​ వాహనం తనిఖీ

మనోహరాబాద్ లో కేటీఆర్​ వాహనం తనిఖీ

మనోహరాబాద్,వెలుగు: పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్​ వెహికల్​ను పోలీసులు తనిఖీ చేశారు. మండలంలోని కాళ్లకల్ జాతీయ రహదారిపై ఆపి  కాన్వాయ్ ను పూర్తిగా చెక్​ చేశారు. అనంతరం కేటీఆర్​ కామారెడ్డి వెళ్లారు.