ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు

నేరడిగొండ, వెలుగు: ఎంపీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలు అనుసరించి పోలీసులకు ఆత్రం సుగుణ సహకరించారు. ఆమె వెహికల్​తో పాటు వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.