కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండ్రాయి దగ్గర కేసీఆర్ వాహనాన్ని ఆపి.. తనిఖీలు చేపట్టారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ సూర్యాపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో మండ్రాయి దగ్గర కేసీఆర్‌ వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.

ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు కేసీఆర్‌ సహకరించారు. కేసీఆర్‌ ప్రయాణించే బస్సుతో పాటు.. ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా పోలీసులు చెక్ చేశారు. ఈ తనిఖీకి సహ కరించిన కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తనిఖీ అనంతరం కేసీఆర్‌ ఎండిన పంటలను పరిశీలించేందుకు బయుదేరారు.

ALSO READ | బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

అనంతరం  పాలకుర్తి నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్... అర్వప‌ల్లి, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో ప‌ర్యటించి, ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలించారు. అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని అక్కడే కేసీఆర్ భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు  మీడియాతో మాట్లాడుతారు. 

మ‌ధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి న‌ల్లగొండ జిల్లాకు బ‌య‌ల్దేరుతారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని ఎండిపోయిన పంటల‌ను ప‌రిశీలించ‌నున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి తిరిగి ఎర్రవెల్లికి బ‌య‌ల్దేరతారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి రాత్రి 9 గంట‌ల‌కు ఫాంహౌజ్ చేరుకుంటారు.