గూడాపూర్ వద్ద వివేక్ వెంకటస్వామి కారు తనిఖీ చేసిన పోలీసులు

నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి కారు తనిఖీ చేశారు. మునుగోడు మండలం గూడాపూర్ చెక్ పోస్ట్ వద్ద కారును ఆపిన పోలీసులు సోదాలు నిర్వహించారు. చెకింగ్ పూర్తైన అనంతరం వివేక్ వెంకటస్వామి మునుగోడు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఈ నెల 9న కూడా వివేక్ వెంకటస్వామి మునుగోడుకు వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యలో ఆయన కారును తనిఖీ చేశారు. చెకింగ్ అనంతరం ఆయన కాసేపు పోలీసులతో ముచ్చటించారు. విధుల్లో ఉన్న పోలీసుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.