ములుగు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ములుగు మండలంలోని మల్లంపల్లి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేయగా డీఎస్పీ రవీందర్ సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేప్పుడు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దని, ఒకవేళ అవసరాల రిత్యా తీసుకెళ్తే సంబంధిత ఆధారాలను చూపించాలని డీఎస్పీ సూచించారు. ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేందుకు గిఫ్ట్ లు, నగదు తరలించకుండా నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. వాహన తనిఖీల్లో సీఐ రంజిత్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్ పాల్గొన్నారు.