ఖమ్మంలో ముమ్మర తనిఖీలు.. స్కూటీలో పట్టుబడ్డ భారీ నగదు

ఖమ్మం పట్టణంలోని ఓ స్కూటీలో రూ. 3 లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. 

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ఖమ్మం పట్టణంలోని TS 04 FG 5823 నంబర్ గల స్కూటీలో రూ. 3 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి పత్రాలు లేకుండా యాక్టివా స్కూటీలో ఓ వ్యక్తి తరలిస్తున్న రూ. 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్కూటీని, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ALSO READ: కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం