రేవంత్ రెడ్డి కారులో పోలీసుల తనిఖీలు

మునుగోడు ప్రచారానికి సాయంత్రానికి తెరపడనుంది. దీంతో బై పోల్ ప్రచారానికి అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. మునుగోడుకు వచ్చి వెళ్లే వాహనాలను పోలీసులు అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడులో మహిళా గర్జన సభకు వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారును తనిఖీ చేశారు. నారాయణపురం చెక్ పోస్టు వద్ద ఆయన కారులో సోదాలు నిర్వహించారు. అందులో ఏమీ దొరకకపోవడంతో అక్కడి నుంచి పంపేశారు.

ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. సాయంత్రం 6 గంటలతో ప్రచారం గడువు ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులతో పాటు పార్టీల ముఖ్యనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఈ రోజు గ్రామగ్రామాన ర్యాలీలకు సిద్ధమైంది. మరోవైపు నారాయణపురంలో మంత్రి కేటీఆర్, మర్రిగూడలో హరీష్ రోడ్ షోలలో పాల్గొననున్నారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో పాలుపంచుకోనున్నారు.