
అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా నైట్ అలెర్టింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఆయన అర్థరాత్రి వరకు సిబ్బందితో మాట్లాడి అనంతరం ఇంటికి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. పని ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి విచారించారు. గతేడాది సెప్టెంబర్ లో ప్రొద్దుటూరు నుంచి సీఐ బదిలీపై తాడిపత్రి వచ్చారు.
ఓ సీఐ ఆత్మహత్య చేసుకుంటే సామాన్య జనం పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆత్మహత్య వెనుక కారాణాలేంటో కనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు.