రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం:  హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై   మే3న  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని..కేసును మూసివేస్తున్నామని కోర్టుకు రిపోర్టు ఇచ్చారు పోలీసులు. రోహిత్ ఆత్మహత్యకు అప్పటి వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే   వైస్ ఛాన్సలర్  చర్యలు తీసుకున్నారని రిపోర్టులో  పేర్కొన్నారు పోలీసులు. అంతేగాకుండా రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి  ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు పోలీసులు.

2016లో జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  రోహిత్ వేముల  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పలువురు బీజేపీ నేతలు , అప్పటి వీసీ అప్పారావుపై  కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే వీళ్లకు  సంబంధం లేదని  గత ప్రభుత్వం  తేల్చింది. గత ప్రభుత్వం హయాంలోనే రోహిత్ కేసు విచారణ పూర్తి కాగా.. 2024 మార్చిలో క్లోజర్ రిపోర్టును ఫైల్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇవాళ (మే 3న) హైకోర్టుకు సమర్పించారు.