లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్.. సిరిసిల్లలో పోలీస్ కమాండెంట్ మృతి

లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్.. సిరిసిల్లలో పోలీస్ కమాండెంట్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లిఫ్ట్ ప్రమాదంలో  పోలీస్ కమాండెంట్ మృతి చెందాడు.లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా  కిందపడిపోవడంతో కమాండెంట్ మృతి చెందాడు.

అసలేంద జరిగిందంటే  జిల్లా కేంద్రంలోని 17 వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ తోట గంగారాం(58) తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ వెళ్లాడు. డిన్నర్ చేశాక  లిఫ్ట్ దగ్గర వెయిట్ చేశాడు. లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడంతో థర్డ్ ఫ్లోర్ నుంచి  ఫస్ట్ ఫోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడిపోయాడు గంగారాం. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకొని తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి తీవ్రంగా గాయపడ్డ గంగారాంను బయటకు తీశారు. 

Also Read :- ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ కేసుల కన్విక్షన్ రేటింగ్‌‌‌‌లో తెలంగాణ ముందంజ

వెంటనే  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు  పోలీసులు. అయితే  ఆసుపత్రికి తరలించే లోపే గంగారం మృతి చెందినట్లు చెప్పారు.  మృతునికి, భార్య రేఖ ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  గంగారాం స్వస్థలం  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం. కుటుంబ పెద్ద దిక్కు గంగారాం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి గంగారం మృతదేహాన్ని తరలించారు