కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంల స్ర్టాంగ్ రూమ్స్ భద్రతా ఏర్పాట్లను సోమవారం వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసి, రిజిస్ర్టార్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కేంద్ర బలగాలు
స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. స్ర్టాంగ్ రూమ్స్ వద్ద మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై బలగాలతో చర్చించామన్నారు. ఎనుమాముల సీఐ రమేశ్, కేంద్ర బలగాలు, పోలీసులున్నారు.