రేవ్ పార్టీలో కుక్కలు గుడ్‍జాబ్: పోలీస్ జాగిలాలకు ప్రసంశలు

బెంగళూర్ రేవ్ పార్టీ తనిఖీల్లో పాల్గొన్ని పోలీస్ స్నిఫర్ డాగ్స్ ను బెంగళూర్ పోలీస్ కమిషనర్ దయానంద్ అభినందించారు. ఈ రేవ్ పార్టీలో దాచిపెట్టిన డ్రగ్స్ ను పట్టించడంలో పా పెట్రోల్ K9 స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయి. విల్లాలో చెట్ల మధ్యలో నిర్వహకులు దాచిపెట్టిన డ్రగ్స్ ను అవి పోలీసులకు పట్టించాయి. ఇదే రేవ్ పార్టీ తెలుగు నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికారు. 

రేవ్ పార్టీని భగ్నం చేసిన బెంగుళూర్ పోలీసులు.. వెంటనే స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. వాటి సేవలు అద్బుతమంటూ బెంగళూర్ సిపి పోలిసు జాగిలాలను ప్రసంశ్రించారు. మొత్తం ఐదు స్నిఫర్ డాగ్స్ బెంగుళూర్ రేవ్ పార్టీ సోదాల్లో పాల్గొన్నాయి.