వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు: సీపీ రెమా రాజేశ్వరి

గోదావరిఖని, వెలుగు :  వృద్ధులను శారీరకంగా, మానసికంగా వేధిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రెమా రాజేశ్వరి తెలిపారు. వృద్ధుల భద్రత, సహాయం అందించడం కోసం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 40 వలంటీర్‌‌‌‌‌‌‌‌ కమిటీలను ఏర్పాటు చేసినట్టు సీపీ చెప్పారు. శనివారం ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్‌‌‌‌లో భాగంగా సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌ల ప్రాణ, ఆస్తుల రక్షణ అత్యంత ముఖ్యమని, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఇంట్లో ఒంటరిగా ఉన్నవారికి, పిల్లలు లేని వారికి, పిల్లలు ఇతర నగరాల్లో లేక విదేశాలలో స్థిరపడిన వారిపై శ్రద్ధ పెట్టనున్నట్టు చెప్పారు. 

ALSO READ: అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: పల్లె తిరుపతి

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సరైన సమయంలో చికిత్స అందించడం తప్పనిసరి అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధుల భద్రత, వారి సహాయం అందించడం కోసం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గల ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాలంటీర్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   ప్రతి కమిటీలో సీనియర్‌‌‌‌‌‌‌‌ సిటిజన్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌జీఓ మెంబర్‌‌‌‌‌‌‌‌, చైల్డ్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ కమిటి మెంబర్‌‌‌‌‌‌‌‌, గవర్నమంట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ ఉంటారన్నారు. పోలీసులు ఈ కమిటి మెంబర్లతో కలిసి తరుచూ సీనియర్‌‌‌‌‌‌‌‌ సిటిజన్‌‌‌‌‌‌‌‌ల నివాసాలకు వెళ్ళి పరిశీలన చేస్తారని చెప్పారు.