- పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో గంజాయి అమ్మకాలు చేపట్టినా, వినియోగించినా పీడీ యాక్టు కింద జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో గంజాయి కేసులు ఎదుర్కొంటున్న వారితో పాటు గంజాయి వాడకానికి అలవాటుపడ్డ వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..హత్యలు, దొంగతనాలు, అల్లర్లకు కారణమవుతున్న గంజాయిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ALSO READ: మంత్రి ఇంటి ముట్టడికి.. అంగన్వాడీల యత్నం
డబ్బు సంపాదన కోసం అమ్మకాలు చేసే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపివేయిస్తామన్నారు. అనుమానితులపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గంజాయి జాడ తెలిపిన వారికి నగదు పారితోషికాలు అందిస్తామని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ జయరామ్, ఏసీపీలు జగదీష్చందర్, కె.కిరణ్కుమార్, కె.వి.కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.