ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు : సునీల్ దత్

  •    పోలీస్ కమిషనర్ సునీల్ దత్    

ముదిగొండ, వెలుగు : పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.  సోమవారం మండలం పరిధిలోని  ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వల్లభి గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నగదు, నగలు తరలిస్తే సీజ్​చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని, పెద్ద మొత్తంలో నగదు

ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మదిగొండ ఎస్సై గజ్జల నరేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.