ఖమ్మం టౌన్, వెలుగు : నేరాల డిటెక్షన్‌లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల ఛేదనలో కీలకంగా పనిచేసే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను పటిష్ట పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాపర్టీ రికవరీ పైన సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.