సరిహద్దుల్లో 6 చెక్​పోస్టులు..సీపీ విష్ణు వారియర్​

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: విజిబుల్​ పోలీసింగ్​తో పాటు నిరంతర తనిఖీలు నిర్వహించాలని పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ అన్నారు. మంగళవారం పోలీస్​ కాన్ఫరెన్స్​ హాల్​ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో సీపీ మాట్లాడుతూ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో 6 చెక్​పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఏసీపీలు తరచూ చెక్​పోస్టులను సందర్శించాలన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.  బ్లాక్​స్పాట్స్​ను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు.  గ్రూప్–4​ పరీక్షలకు  బందోబస్త్​ ఏర్పాటు చేయాలని సూచించారు.  ఫంక్షనల్​ వర్టికల్ అమలులో ప్రతిభ చూపిన పోలీస్​ సిబ్బందికి సీపీ రివార్డులను అందించారు.  సమావేశంలో ట్రైనీ ఏఎస్పీ అవినాష్​​కుమార్, ​ఏడీసీపీలు సుభాశ్​చంద్రబోస్​, కుమారస్వామి, ఏసీపీలు బస్వారెడ్డి, ప్రసన్నకుమార్, గణేశ్, రెహమాన్​, రామానుజం, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.