
గజ్వేల్, వెలుగు : జై శ్రీరాం అనకుండా యువకులకు బీఆర్‌ఎస్ నాయకులు నచ్చజెప్పాలని పబ్లిక్ మీటింగ్‌లో కేటీఆర్ చెప్పడంతో బీజేపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ఇన్స్‌పెక్టర్ సైదాకు ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు అందజేసిన వారిలో గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేశ్, మండల అధ్యక్షులు అశోక్‌గౌడ్, నాయకులు నాగు ముదిరాజ్, పెండ్యాల శ్రీనివాస్, లింగం, సంతోష్, అరవింద్ ఉన్నారు.