ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మ దహనం... కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

హైదరాబాద్: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై కూకట్ పల్లి బీఆర్ఎస్​ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు సీరియస్ అయ్యారు. మొదటి నుంచి ఆయన అహంకారపూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించి ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్​చేశారు.

ALSO READ : హస్తమే దేశానికి రక్ష.. సీఎం రేవంతన్నకు అభినందనలు: ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్

కులాలను కించపరుస్తూ మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ వెలమ సంఘం నాయకులు కూకట్​పల్లిలో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో షాద్ నగర ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.