ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘనలు.. 5,431 మందికి లీగల్ నోటీసులు

  • ట్రాఫిక్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసుల స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌
  • పదికి మించి చలాన్స్‌‌‌‌ ఉంటేచార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ దాఖలు 
  • వాహనదారులను కోర్టులో హజరుపర్చి జరిమానా వసూలు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను పదేపదే ఉల్లంఘిస్తున్న వారిపై, పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్‌‌‌‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పది కంటే ఎక్కువ చలాన్స్ పెండింగ్‌‌‌‌లో ఉన్న వెహికల్స్ యజమానులపై చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్‌‌‌‌ను కూడా ఏర్పాటు చేశారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌‌‌‌‌‌‌‌తో లింక్‌‌‌‌ అయిన ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కి మెసేజ్‌‌‌‌ పంపి, కేసు నమోదు సమాచారాన్ని అందిస్తున్నారు. కోర్టుకు హాజరు కావాల్సిన తేదీ, సమయం గురించి సమాచారం పంపిస్తున్నారు. దీనిపై స్పందించని వారికి లీగల్‌‌‌‌ నోటీసులు పంపిస్తున్నారు.

అనంతరం కోర్టులో హాజరుపరిచి పెండింగ్‌‌‌‌ చలాన్‌‌‌‌ను వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంగా 1,115 మందిపై ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు చార్జిషీట్స్‌‌‌‌ దాఖలు చేసి, కోర్టులో హాజరుపరిచి, జరిమానాలు వసూలు చేశారు. టాప్‌‌‌‌ వాయిలేషన్స్‌‌‌‌కు సంబంధించి 71,782 వెహికల్స్ రోడ్లపై తిరుగుతున్నట్లు సిటీ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఒక్కో వాహనంపై పదికి పైగా చలాన్స్‌‌‌‌ ఉన్నట్లు డేటా సేకరించారు. ఇందులో 5,431 మందికి లీగల్ నోటీసులు పంపారు. 

గతంలో మూడు చలాన్లకే చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌..

ఈ చలాన్ పద్ధతి ప్రారంభయ్యాక మొదట్లో మూడు చలాన్స్ దాటిన వాహనదారులపై చార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో హాజరుపరిచేవారు. చలాన్స్‌‌‌‌ చెల్లించకుండా తప్పించుకుని తిరిగే వాహనదారులను స్పెషల్ డ్రైవ్‌‌‌‌లో పట్టుకునేవారు. గతంలో రెండుసార్లు చలాన్స్‌‌‌‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినా చాలా మంది వినియోగించుకోలేదు. ప్రస్తుతం 150 చలాన్స్‌‌‌‌ పెండింగ్‌‌‌‌లో ఉన్న వెహికల్స్‌‌‌‌ కూడా సిటీ రోడ్లపై తిరుగుతున్నాయి.

ఈ క్రమంలో 10 చలాన్స్‌‌‌‌కు మించిన ఉన్న వాహనదారులను పోలీసులు గుర్తిస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాల నంబర్స్ ఆధారంగా ఆయా వెహికల్స్‌‌‌‌ యజమానులకు లీగల్‌‌‌‌ నోటీసులు పంపిస్తున్నారు. పదేపదే రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల పూర్తి వివరాలను పోలీసులు కోర్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్ సహా ఇతర ట్రాఫిక్ వాయిలేషన్స్‌‌‌‌లో పట్టుబడిన వారి వెహికల్స్‌‌‌‌ను తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు.

ప్రజల్లో ఇంకా  అవగాహన రావాలి..

ట్రాఫిక్ రూల్స్‌‌‌‌పై ప్రజల్లో ఇంకా అవగాహన రావాలి. చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిగ్నల్ జంపింగ్‌‌‌‌, రాంగ్‌‌‌‌ సైడ్ డ్రైవింగ్‌‌‌‌, ఓవర్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌, డేంజరస్ డ్రైవింగ్‌‌‌‌తో ప్రాణనష్టం జరుగుతున్నది. ఇలాంటి వారిని గుర్తిస్తున్నాం. పదేపదే రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని టాప్‌‌‌‌ వాయిలేటర్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో చేర్చుతున్నాం. అలాంటి వారిపై చార్జిషీట్స్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం.– విశ్వప్రసాద్‌‌‌‌, అడిషనల్‌‌‌‌ సీపీ (ట్రాఫిక్‌‌‌‌)