జనగామ అర్బన్/ వర్ధన్నపేట, వెలుగు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పలుచోట్ల కార్డెన్ సెర్చ్‌నిర్వహించారు. మంగళవారం జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఏసీపీ పార్ధసారథి ఆధ్వర్యంలో, వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో ఏసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వీవర్స్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లతోపాటు ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం, సరైన పత్రాలు లేని 15 బైకులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ల్యాబర్తిలో పత్రాలు, నంబర్ ఫ్లేట్ లేని 18 బైక్‌లు, 4 ఆటోలు, గూడ్స్ ఆటోను సీజ్‌చేశారు. రూ.12,320 విలువగల లిక్కర్‌ను సీజ్‌చేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సెర్చ్‌లో సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.