హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బుధవారం రాత్రి పట్టణంలోని నాగారంరోడ్డులో డబుల్బెడ్రూంకాలనీలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేశారు. ఇండ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అని ఆరా తీశారు. అనుమానితులను ప్రశ్నిస్తూ, వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కార్డన్‌సెర్చ్‌లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 బైకులు, 5 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రజల రక్షణతోపాటు వారిలో సెక్యూరిటీ పట్ల అవగాహన కలిగించడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్టు ఏసీపీ సతీశ్ తెలిపారు. సైబర్ నేరం జరిగితే ఎన్సీఆర్పీ పోర్టల్ www.cybercrime.gov.in <http://www.cybercrime.gov.in> లో ఫిర్యాదు చేయాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 1930, 100కు కూడా కాల్ చేయొచ్చన్నారు.హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్, అక్కన్నపేట, కోహెడ ఎస్సైలు విజయభాస్కర్, అభిలాష్, సర్కిల్ పోలీసు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.