భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని ఛత్తీస్‌గఢ్ బార్డర్లో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామం కొరకట్పాడులో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామస్తులతో సమావేశమై అక్కడ నివసించే 40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు.
ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని చర్ల సీఐ రాజువర్మ తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించొద్దని సూచించారు. ఎస్సై నర్సిరెడ్డి, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
ఆళ్లపల్లి : మండల పరిధిలోని ముత్తాపురంలో ఎస్సై రతీశ్కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ నివసించే 11 కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి ఎలాంటి సహాయం అందించవద్దని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.