జైనూర్​లో పోలీసులు ఫ్లాగ్​మార్చ్

జైనూర్​లో పోలీసులు ఫ్లాగ్​మార్చ్

జైనూర్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జైనూర్ మండల కేంద్రం మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాణిదుర్గావతి చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ వరకు120 మంది ప్రత్యేక పోలీసులు ఫ్లాగ్​మార్చ్​లో పాల్గొన్నారు. ప్రజల భద్రతకు పోలీసులు నిత్యం అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జైనూరు సీఐ రమేశ్, డీసీఆర్బీ సీఐ సంపత్, జైనూర్, లింగాపూర్ ఎస్సైలు సాగర్, గంగన్న, పీఎస్ఐలు పాషా, అనిల్ పాల్గొన్నారు.