హెల్మెట్ ప్రాణాన్ని కాపాడే రక్షణ కవచం

మంచిర్యాల/నేరడిగొండ, వెలుగు :  రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు హెల్మెట్ ఉపయోగాలు తెలుపుతూ మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని కోరారు. టూ వీలర్ ప్రమాదాల్లో చాలామంది హెల్మెట్​ లేకనే చనిపోతున్నారని వివరించారు.

నిత్యం స్పెషల్ డ్రైవ్  నిర్వహిస్తూ  హెల్మెట్ ధరించని వారిపై  కేసులు నమోదు చేస్తామన్నారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ నరేశ్ కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నేరడిగొండ ఎస్​ఐ సాయన్న అన్నారు.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్స వాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకునే జాగ్రత్తలు, రోడ్డు నియమనిబంధలు వివరించారు. మద్యం తాగి, ఫోన్​లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు.