పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ‘ఓపెన్ హౌజ్’ నిర్వహించారు. డీసీపీ సృజన అతిథిగా పాల్గొని పోలీసింగ్, ప్రజల భద్రతకు తీసుకునే చర్యలను వివరించారు. వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన 1200 మంది స్టూడెంట్లకు పోలీసులు లైట్ మిషిన్ గన్లు, అధునాతన రైఫిల్స్, బాంబ్ డిటెక్షన్ డివైజ్లు, వివిధ రకాల వెపన్స్ గురించి వివరించారు.
బ్యాండ్ డ్రిల్, మౌంటెడ్పోలీసుల గుర్రపు స్వారీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ సమీర్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
వెలుగు, గచ్చిబౌలి