రంగారెడ్డి జిల్లా : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్. నార్సింగి, అత్తాపూర్ చౌరస్తా. బండ్లగూడ జాగీర్ ప్రాంతాలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 ద్విచక్ర వాహనాలు, 5 కార్లు పట్టుపడ్డాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని, అలా నడిపితే 10 వేల జరిమానా విధిస్తామని ముందుగానే పోలీసులు హెచ్చరించినప్పటికీ కొందరు వాహనదారులు మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడ్డారు.
ఇంకొందరు అయితే పోలీసులకు పట్టుబడి వారి వికృత చేష్టలతో పోలీసులకే చుక్కలు చూపించారు. పట్టుబడ్డ వారిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. మొత్తం 77 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పోలీసులు నమోదు చేశారు.