నేరడిగొండలో 40 లక్షల నగదు పట్టివేత

నేరడిగొండ, వెలుగు: ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు నేరడిగొండ మండలంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద బుధవారం తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు వెళ్తున్న కారులో రూ.40 లక్షలను ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు.

ఎలాంటి రసీదులు చూపకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ మీడియాకు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ రాధా రాథోడ్, పోలీసులు పాల్గొన్నారు.