షేర్ మార్కెట్లో కోటి రూపాయల వరకూ నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి లోనై చివరకు చావే శరణ్యమని నిర్ణయానికొచ్చాడు. చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలు తండ్రికి దూరమై శోకంతో విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన అంబర్పేట్ దుర్గా నగర్లో గురువారం జరిగింది.
మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏ. వెంకటేశ్వర్లు( 42) సంవత్సరాలు. 2007 బ్యాచ్ కానిస్టేబుల్. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంబర్పేట్ దుర్గా నగర్లో తన ఇంట్లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయాడు. వెంకటేశ్వర్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అతనికి భార్య.. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వీరి స్వస్థలం సూర్యాపేట. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘటనే 2024, డిసెంబర్ నెలాఖరులో జరిగింది. అప్పుల బాధతో ఓ హెడ్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్‌లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ 60లక్షలు పెట్టుబడి పెట్టాడు.
Also Read :- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు 2024 ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్‌లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క ఈఎంఐల టెన్షన్, మరో పక్క అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి.. ఈ బాధ భరించలేక డిసెంబర్ 22, 2024న సూసైడ్ నోట్ రాసి పురుగు మందు తాగి భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు.