సూర్యాపేట జిల్లాలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో తెల్లవారుజామున సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 బైక్ లు, 4 ఆటోలను సీజ్ చేశారు.
గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి తెలిపారు. అదేవిధంగా ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.