మైలార్ దేవ్ పల్లిలో 20 లక్షల దారి దోపిడి కేసును చేధించిన పోలీసులు

మైలార్ దేవ్ పల్లిలో 20 లక్షల దారి దోపిడి కేసును చేధించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారిదోపిడి కేసును చేధించారు పోలీసులు. రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేందద్ బజాజ్ రూ. 20 లక్షల రూపాయల నగదును ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తుండగా దోపిడీ చేసిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి నగదును స్వాధీనం చేసుకున్నారు.రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు  డీసీపీ శ్రీనివాస్

 పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 4న జితేందద్ బజాజ్  బ్యాంక్ నుంచి 20 లక్షలు విత్ డ్రా చేసుకొని వస్తుండగా ఫాలో అయి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు.  బైక్ ను కారుతో ఢీకొట్టి రూ., 20 లక్షల నగదుతో  పరారయ్యారు.   బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..  దుండగులు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ కు పరారైనట్లు గుర్తించారు.  మహారాష్ట్ర బార్డర్ లో కారు దిగి బస్సెక్కి వెళ్లారు దుండగులు.  రాజస్థాన్ లో ముగ్గురు నిందితులు సచిన్,సీతారాం స్వామి,హేమంత్ శర్మలను అరెస్ట్ చేశారు పోలీసులు , మరొకరు పరారీలో ఉన్నారు.

ALSO READ | వీల్చైర్ లేక ఆస్పత్రిపాలైన లెఫ్టినెంట్ జనరల్ భార్య..ఎయిర్ ఇండియాపై ప్యాసింజర్ల ఆగ్రహం

 అరెస్ట్  అయిన నిందితుల  నుంచి రూ. 18 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నాం. గతంలో జితేందర్ బజాజ్ కి చెందిన SRM ప్రొడక్ట్ పరిశ్రమలో పనిచేసిన సచిన్ స్వామి, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రశాంత్ లు ప్లాన్ ప్రకారమే నగదు చోరీ చేశారు. చోరీకి ముందు గత వారం రోజుల క్రితం నుంచి రెక్కీ నిర్వహించారు నిందితులు.  పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నాం అని  తెలిపారు.