- 5 నెలల్లో 6916 డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్
- ట్రాఫిక్ వయలేషన్స్ పై పోలీసుల కొరడా
- లైసెన్స్ రద్దు కోసం ఆర్టీఏకు సిఫారసు
- అమలు చేస్తున్న రవాణాశాఖ ఆఫీసర్లు
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని కోరుతూ రవాణాశాఖకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఆ లైసెన్సులను క్యాన్సిల్ చేస్తున్నారు.
నూతన నిబంధనలు అమల్లోకి వచ్చిన ఈ ఐదు నెలల వ్యవధిలో 6916 లైసెన్సులను రద్దు చేయడం విశేషం. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ లోడ్ తదితర కారణాలతో భారీగా డ్రైవర్ల లైసెన్సులు క్యాన్సిల్ కావడం గమనార్హం.
ఫైన్ వేయడం వల్ల పరిస్థితి దారికి రావడం లేదని భావిస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు కొత్త తరహా ట్రీట్ మెంట్ కు శ్రీకారం చుట్టడం విశేషం.