
హైదరాబాద్ నగరంలో బైక్ రేసింగ్ పై పోలీసులు కొరడా ఝులిపించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ రేసింగ్ నిర్వహిస్తుండగా.. 50 బైక్ లను సీజ్ చేశారు. శనివారం (జూన్ 1) రాత్రి టీ హబ్ ఏరియా, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్ ఏరియా, సత్య భవనం, మైహోం భుజ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసు లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 50 బైకులను సీజ్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేసింగ్ లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. బైకులను అర్టీఓ అధికారులకు అప్పగించారు.