
- సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: రిటైర్మెంట్అయిన పోలీసులకు అండగా ఉంటామని సీపీ అనురాధ అన్నారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఎస్ఐలు మంజూర్ హుస్సేన్, యెల్లు కృష్ణారెడ్డిని అభినందించి శాలువాతో సన్మానించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పదవి విరమణ పొందిన పోలీసు అధికారులు శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలన్నారు. అత్యవసరమైతే వారి సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మెదక్ టౌన్: నర్సాపూర్ ఎస్ఐగా సేవలందించిన శ్రీనివాస్ నురిటైర్మెంట్సందర్భంగా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పోలీసు వ్యవస్థకు సేవలందించినఎస్ఐ శ్రీనివాస్ శేషజీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. ఆయన తన సర్వీసులో ఎలాంటి రిమార్కులు లేకుండా పూర్తి చేసినందుకు ప్రభుత్వం ఉత్తమ సేవా పథకాలతో గౌరవించిందని తెలిపారు. ఏఎస్పీ మహేందర్. ఇన్స్పెక్టర్సందీప్రెడ్డి, శ్రీనివాస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.