ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ లపై ఉన్న కేసుల సంఖ్య తేలింది. ఇద్దరిపై చెరో 23 కేసులు ఉన్నాయని పొలిసు శాఖ తెలిపింది. నామినేషన్ల దాఖలు కోసం వివరాలు అడుగగా పోలీస్ శాఖ ఈ వివరాలు అందజేసింది. చంద్రబాబు, లోకేష్ లపై ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులు ఎనిమిది ఉండగా, మిగతా 15కేసులు జిల్లాల పర్యాటన సమయంలో నమోదయ్యాయి.
లోకేష్ పై సీఐడీ నమోదు చేసిన కేసు ఒకటి ఉండగా, మిగతా కేసులు యువగళం పాదయాత్ర సమయంలో నమోదయ్యాయి. ఇద్దరిపై ఉన్న కేసుల్లో ఎక్కువ శాతం వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనవే కావటం గమనార్హం. ఇదిలా ఉండగా కేసుల సంఖ్యపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబును 23 సంఖ్య వెంటాడుతోందని, గత ఎన్నికల్లో 23సీట్లతో ఘోరంగా ఓడిపోగా ఇప్పుడు తండ్రి, కొడుకులు ఇద్దరిపై ఉన్న కేసుల సంఖ్య కేసుల 23గానే ఉందని ఎద్దేవా చేస్తున్నారు.