
ఝరాసంగం,వెలుగు: పిల్లలకు వేసవి సెలువులు రావడంతో స్థానికంగా ఉండే చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని స్థానిక ఎస్‌ఐ రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గల చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. పిల్లలు సమ్మర్‌లో ఎటు వెళుతున్నారనేది గమనించాలని సూచించారు.