మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక డంప్ చేసి లారీల తో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహదేవపూర్ ఎస్ ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మహాదేవపూర్ శివారులో బొమ్మపూర్ క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా ఇసుకను నిల్వ చేసి లారీలో నింపుతున్నారని సమాచారం వచ్చింది.
సంఘటన స్థలనికి వెళ్లి చూడగా అక్రమంగా డంప్ చేసిన ఇసుక ను ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో లారీలో నింపుతున్నారు. లారీ డ్రైవర్ ఓడేటి భరత్, జేసీబీ డ్రైవర్ పోతుగంటి సమ్మయ్య లను వెహికిల్స్ తో పాటు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు. సెర్చ్ లో మహాదేవపూర్ ఎస్సై చక్రపాణి, సిబ్బంది ధనుంజయ్, తిరుపతి, కిరణ్ లు పాల్గొన్నారు.