- ఎన్టీఆర్, పీవీ మార్గ్‌లలో మాత్రమే అనుమతి
హైదరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనానికి ఈ ఏడాది పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కోర్టు ఆదేశాలను తప్పనిసరి పాటిస్తామని, అందరు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్ కోరారు. అయితే, ఎన్టీఆర్, పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లలో నిమజ్జనం కోసం అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అలాగే, పలు చోట్ల బేబీ పాండ్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.