వాజేడు, వెంకటాపురం మండలాల్లో.. నిత్యావసర సరుకులు పంపిణీ

వెంకటాపురం వెలుగు: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లోని గోదావరి ముంపు గ్రామాలకు పోలీసులు ఆదివారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో వాజేడు మండలం బొమ్మనపల్లి గిరిజన గ్రామంలో సీఐ బండారు కుమార్, వాజేడు ఎస్సై హరీశ్, వెంకటాపురం మండలం పాత్రపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఎస్సై కొప్పుల తిరుపతిరావు, సిబ్బంది నూనె, పప్పులు, కూరగాయాలు కూరగాయలు పంపిణీ చేశారు.