- ఆప్యాయంగా కరచాలనం చేసిన ఎస్పీ
జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గత నెల 23న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్ నిందితుల వివరాలను బుధవారం వెల్లడించారు. కాగా చోరికి పాల్పడిన వాళ్లు ఏ దారిలో వెళ్లారనే కీలకమైన సమాచారాన్ని రాబిన్ అనే పోలీసు జాగిలం అందించింది. దొంగలు తాగి పడేసిన బీర్ బాటిల్స్ ని పసిగట్టి విచారణ వేగవంతం చేయడానికి సహకరించింది. ఆ బాటిల్స్ పై ఉన్న వేలి ముద్రల ఆధారంగా నిందుతుల ఆధార్ ను గుర్తించగలిగారు. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్.. ‘థాంక్యూ రాబిన్’ అంటూ ఆప్యాయంగా కరచాలనం చేశారు.
పరారిలో ఉన్న నిందుతులు కర్ణాటకలోని బీదర్ లో తల దాచుకున్నారు. 10 బృందాలుగా వెళ్లిన పోలీసులు నిందుతుల్ని పట్టుకున్నారు. వాళ్లలో ముగ్గురు పట్టు బడగా, మరో నలుగురు పరారిలో ఉన్నారు. వాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ భాస్కర్ వెల్లడించారు.