నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా పోలీసు శాఖకు చెందిన ఓ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా పోలీసులు నివాళి అర్పించారు. 2018 నుంచి జూలీ అనే జాగిలం పలు క్రిమినల్కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. జూలీ అనారోగ్యంతో మృతిచెందగా.. జిల్లా పోలీసు ఆఫీసులో దాని కళేబరంపై ఎస్పీ ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లాబ్రడార్ జాతికి చెందిన ఈ జాగిలం వీఐపీ, వీవీఐపీ బందోబస్తు విధులు నిర్వహిస్తూ, పలు హత్య, దొంగతనం కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబర్చిందన్నారు. జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లలోనూ పాల్గొని ప్రతిభ చూపిందన్నారు. అనంతరం పోలీసు లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు.