హైదరాబాద్ రాయదుర్గంలోని ఒరియన్ విల్లాలో హై టెన్షన్ నెలకొంది. జన్వాఢ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు ఒరియన్ విల్లాలో తనిఖీలు చేపట్టారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సోదరుడు శేలేంద్ర పాకాల నివాసంలో 3 గంటలకు పైగా ఎక్స్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేశారు. శేలేంద్ర ఇంట్లో సోదాలు కొనసాగుతుండగానే.. తాజాగా రాజ్ పాకాల నివాసంలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉండటంతో.. తాళం పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు.
ALSO READ | కేటీఆర్ బామ్మర్దే కొకైన్ ఇచ్చిండు: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు
అడ్వొకేట్ సమక్షంలో రాజ్ పాకాల నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు శైలేంద్ర ఇంట్లోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. జన్వాఢ ఫామ్ హౌస్‌లో రాజ్ పాకాల ఏర్పాటు చేసిన పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం దొరకడంతో.. అతడిని నివాసంలో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఒరియన్ విల్లాలో అధికారుల సోదాలకు అడ్డుతగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.