బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 92లో 415 గజాల విలువైన భూమిని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరి కబ్జా చేసినట్లు ఆరోపిస్తూ.. కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  నకిలి పత్రాలు సృష్టించి  కార్పొరేటర్ శ్రీ విద్య భూమి కబ్జాకు యత్నించారని విచారణలో తేలింది. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్ 420, 467, 468, 471 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.