హైదరాబాద్ నాంపల్లిలో దొంగలపై పోలీసుల కాల్పులు

  • నాంపల్లిలో ఘటన 
  • డెకాయి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తుండగా పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నం
  • ఆత్మరక్షణ కోసం దొంగలపై కాల్పులు జరిపామన్న పోలీసులు

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కాల్పులు జరిగాయి. సెంట్రల్ జోన్ డెకాయి టీమ్, ఆర్డ్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుళ్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారన్న సమాచారంతో గురువారం తనిఖీ చేపట్టారు.

మల్లెపల్లి మాంగర్ బస్తీకి చెందిన రాజు(19), హాబీబ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్ ఖాజా (19) తమ వెంట తెచ్చుకున్న గొడ్డలితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో బెదిరించి రూ.400 దొంగిలించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు ప్రశ్నించగా, తమ వెంట తెచ్చుకున్న గొడ్డలితో పాటు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు.

దీంతో పోలీసులు కాల్పులు జరపగా, రాజు అనే వ్యక్తికి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతన్ని ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మరో వ్యక్తి మహ్మద్ ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ఆత్మరక్షణ కోసమే ఫైరింగ్ : పోలీసులు

ఆత్మరక్షణ కోసమే దొంగలపై ఫైరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిపామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. వారి వద్ద గొడ్డలి ఉండటంతో ప్రశ్నించామన్నారు. వారి వివరాలు తెలుసుకుంటున్న సమయంలో గొడ్డలితో పాటు రాళ్లతో తమపై దాడి చేసే ప్రయత్నించారన్నారు.

గొడ్డలి కిందపడేసి సరెండర్ కావాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం రాజు అనే యువకుడిపై ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో వీరిపై పిక్ పాకెట్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.